వైద్య రంగంపై జగన్ సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ

  • వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు కింద రూ.17300 కోట్లకుపైగా ఖర్చు
  • జనవరి లోగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలకు టెండర్లు పూర్తి
  • కాలేజీల్లో ‘‘గ్రీన్‌ బిల్డింగ్స్‌’’
  • నవంబర్‌ 13 నుంచి మిగిలిన 6 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కింద 2వేల వ్యాధులకు చికిత్స
  • ఈ లోగా మరిన్ని వైద్య ప్రక్రియలను చేర్చేందుకు పరిశీలన
  • హెల్త్‌ క్లినిక్స్‌ వచ్చేవరకూ ఆరోగ్యశ్రీ రిఫరల్‌ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ కీలక ఆదేశాలు

అమరావతి: వైద్య ఆరోగ్య రంగంలో నాడు– నేడుపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని తదితర అధికారులు హాజరు

  • నాడు – నేడు కింద కొత్తగా తీసుకొస్తున్న 16 మెడికల్‌కాలేజీలు, ఉన్న మెడికల్‌కాలేజీల్లో అభివృద్ధి, పునరుద్ధరణ పనులు, అలాగే సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ తదితర వాటి నిర్మాణాలు, అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష
  • నిధుల సమీకరణ, టెండర్లు, జరుగుతున్న పనులపై సమగ్రంగా అధికారులతో సమీక్షించిన సీఎం
    మొత్తంగా వీటికి రూ. 17,300 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు అవుతుందని తెలిపిన అధికారులు
  • ఆస్పత్రుల నిర్వహణ లో అత్యుత్తమ ప్రమాణాలు ఉండాలి:
    ప్రతి అంశానికీ బాధ్యులు ఉండాలి:
    ఆస్పత్రిలో పరికరాల దగ్గరనుంచి ఏసీల వరకూ కూడా ప్రతిదీ సక్రమంగా పనిచేయాలి:
    అన్నిరకాల ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాటి నిర్వహణ బాగోలేదనే మాట రాకూడదు:
    16 మెడికల్‌ కాలేజీలను కొత్తగా తీసుకువస్తున్నాం:
    భారీ మొత్తంలో డబ్బు ఖర్చుచేసి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం:
    ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు:
    ఆస్పత్రుల్లో శానిటేషన్, పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దు:
    జనరేటర్లు పనిచేయడం లేదు, ఏసీలు పనిచేయడంలేదు, శుభ్రత లేదు, శానిటేషన్‌ లేదనే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు:
    కార్పొరేట్‌ ఆస్పత్రులతో దీటుగా ఉండాలి
  • ఆస్పత్రుల నిర్మాణంలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను పరిశీలన చేసి.. వాటిని పాటించండి:
  • పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణాలకు నవంబరు లోగా టెండర్లు
  • అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నర్సాపురం, నంద్యాల, మార్కాపురం, బాపట్లలో మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు డిసెంబరులో టెండర్లు
  • విజయనగరం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు జనవరిలో టెండర్లు
    వీటికోసం రూ.7500 కోట్లకుపైగా ఖర్చు
  • ఇప్పుడున్న మెడికల్‌ కాలేజీల్లో నాడు – నేడు పనులకు మరో రూ. 5472 కోట్లు ఖర్చు
    వీటికి అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులను వెంటనే మంజూరుచేయాలని సీఎం ఆదేశం
    నిర్మాణ రీతిలో హరిత విధానాలు పాటించడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించాలని సీఎం ఆదేశం
  • ఆరోగ్యశ్రీ రిఫరల్‌ విధానం బాగుండాలి
    వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ వచ్చేంతవరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వండి
    అక్కడున్న హెల్త్‌ అసిస్టెంట్‌/ఏఎన్‌ఎంల ద్వారా రిఫరల్‌ చేయించాలి
    ఎంపానల్‌ అయిన ఆస్పత్రుల జాబితాను గ్రామ, వార్డు, సచివాలయాల్లో ఉంచండి
    ఎవరైనా వైద్యం కావాలనుకుంటే.. ఆ రోగికి మార్గనిర్దేశం చేయాలి
  • ఈ నవంబర్‌ 13 నుంచి ఆరోగ్యశ్రీకింద 2 వేల వ్యాధులకు(ఇప్పటికే 7 జిల్లాల్లో అమలవుతుంది) మిగిలిన 6 జిల్లాల్లో (శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం) చికిత్స
    దీంతో అన్ని జిల్లాలకూ అందుబాటులోకి వస్తోంది
    అవసరం అనుకుంటే అదనంగా వైద్య ప్రక్రియలను ఈ జాబితాలో చేర్చండి
    అంతిమంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలి