జగన్ సంచలన నిర్ణయం.. స్కూల్‌ అటెండెన్స్‌లో విద్యార్ధుల కుల, మతాల ప్రస్తావనకు చెక్
Timeline

జగన్ సంచలన నిర్ణయం.. స్కూల్‌ అటెండెన్స్‌లో విద్యార్ధుల కుల, మతాల ప్రస్తావనకు చెక్

ఎవరు ఏమన్నా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు విషయాల్లో దేశం లోనే మంచి సీఎం గా గుర్తింపు తెచ్చుకునే కార్యక్రమాలు చేపట్టి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఒకటి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల భవనాల రూపు రేఖల్ని మార్చేశాడు . కార్పోరేట్ స్కూళ్లను తలదన్నేలా తీర్చి దిద్దారు. పిల్లలకు పోష్టిక ఆహారం అందించటం దగ్గర నుండి , వారికీ మంచి బట్టలు , పుస్తకాల వరకు ఎక్కడ తగ్గట్లేదు. ఇక రెండోది ఆరోగ్యం , రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా ఆరోగ్య శ్రీ ని ప్రతీ పేదవాడికి అందేలా తగు చర్యలు తీసుకుంటున్నాడు.

ఇపుడు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాల అటెండెన్స్ బుక్ లో ఇకపై పిల్లల కుల , మాత ప్రస్తావన రాకూడదనే ఉద్దేశంతో ఆ వివరాలను తొలగించాలని నిర్ణయం తీసుకొని జీవో రిలీజ్ చేసారు. అయితే స్కూలు రికార్డుల్లో మాత్రం వీటిని నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగానే విద్యార్ధుల కులం, మతాల ఆధారాలు అందుబాటులో ఉండబోతున్నాయి

జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై కూడా ప్రతిపక్షం కోర్టుకు వెళ్లనుందా అనే అనుమానాలు మొదలయ్యాయి ప్రజల్లో. ఇప్పటి వరకు జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దానిని ఆపడానికి ప్రతిపక్ష నేతలు ఏదో ఒక వంక పెట్టి కోర్టు మెట్లు ఎక్కి స్టేలు తీసుకొచ్చారు. అయితే మంచో , చెడో జగన్ తీసుకున్న నిర్ణయాలు అమలు అయినా జగన్ కే లాభం చేకూరేలా ఉన్నాయి . ఒకవేళ అవి అమలు కాకుండా ప్రతిపక్షాలు కోర్టుకెళ్లినా అది జగన్ కి ప్రజల్లో మరింత ఆదరణ తెచ్చిపెట్టేలా అవుతున్నాయి.

ఇప్పటికి భూస్థాపితం అయిపోయిన టీడీపీ ఇప్పుడైనా స్ట్రాటజీ మార్చి ముందుకు పైకి లేస్తుందా లేదా చూడాలి.