జగన్ ప్రభుత్వం: చంద్రబాబు హయాంలో టీటీడీ భూముల అమ్మకాలపై తీసుకున్న టీటీడీ బోర్డు నిర్ణయాన్ని రద్దు చేయండి
Timeline

జగన్ ప్రభుత్వం: చంద్రబాబు హయాంలో టీటీడీ భూముల అమ్మకాలపై తీసుకున్న టీటీడీ బోర్డు నిర్ణయాన్ని రద్దు చేయండి

టీటీడీ భూముల విషయంలో జరుగుతున్న రగడకు  ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది.  టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది.  మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయాలు తీసుకోవాలని, ఆ తరువాత భూముల విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 

చంద్రబాబు హయాంలో అంటే 2016 లో దీనిపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మరొకసారి దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకోమని సలహా ఇచ్చింది జగన్ ప్రభుత్వం.

ఇక టీటీడీ వద్ద ఉన్న భూముల్లో టీటీడీ దేవాలయాల నిర్మాణాలు, ధర్మ ప్రచారాలు, మతపరమైన అంశాలకు వినియోగించే అవకాశంను పరిశీలించాలని ప్రభుత్వం టీటీడీ ని కోరింది.  అన్ని అంశాలను పరిశీలించే వరకు భూముల విక్రయాల ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

Leave a Reply

Your email address will not be published.