బిగ్ బ్రేకింగ్: బాబుకి రిటర్న్ గిఫ్ట్, వైసీపీలో చేరనున్న 7 మంది టీడీపీ ఎమ్మెల్యేలు
Timeline

బిగ్ బ్రేకింగ్: బాబుకి రిటర్న్ గిఫ్ట్, వైసీపీలో చేరనున్న 7 మంది టీడీపీ ఎమ్మెల్యేలు

ప్రకాశం జిల్లాలో టీడీపీ మరో షాక్‌..వైసీపీలో చేరనున్న పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు..సాయంత్రం సీఎం జగన్‌ను కలవనున్న ఎమ్మెల్యే సాంబశివరావు

కరోనా కారణంగా హైదరాబాద్ లో ఉండిపోయిన చంద్రబాబు ఎట్టకేలకు ఏపీ ప్రబుత్వం నుండి పర్మిషన్ తీసుకొని నిన్ననే ఆంధ్రాకి చేరుకున్నారు. ఇలా రాష్ట్రానికి రిటర్న్ అయ్యారో లేదా ఇంతలోనే జగన్ రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసినట్టు తెల్సుతుంది. టీడీపీకి డబుల్‌ షాక్ ఇచ్చేందుకు వైసీపీ సిద్దమవుతుంది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సాయంత్రం సీఎం జగన్‌ను కలవనున్నారని.. అక్కడే పార్టీలో చేరనున్నారని సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలతో మంత్రి బాలినేని, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మంతనాలు జరిపారు.

ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కరణం బలరాం ఇప్పటికే వైసీపీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కరణంతో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీ మద్దతుదారుల జాబితాలో ఉన్నారు.

వీళ్ళే కాకుండా ఇంకా 7 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో సమాచారం. ఇప్పటికే టీడీపీ కేవలం 23 మాత్రమే సీట్లు సంపాదించి పార్టీ ఉనికిని కోల్పోయింది. గత ఏడాదిలో ప్రజల్లో పార్టీ నాయకులూ కనిపించిన దాఖలాలు లేవు. అటు ప్రతి పక్షంలో ఉన్న, అధికారంలో ఉన్నా ఎప్పుడు ఏదో రకంగా ప్రజల్లో ఉన్నాడు జగన్. అంతే కాకుండా జగన్ వెల్ఫేర్ స్కీములు పేద ప్రజలకు అందుతుండటం తో జగన్ ప్రభుత్వంపై రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది.

అందుకే ఇక టీడీపీ లో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని గ్రహిస్తున్న టీడీపీ నేతలు వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు.

ఈ లిస్టులో ఉన్న వ్యక్తులు త్వరలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట

వసుపల్లె గణేష్ కుమార్ – విశాఖ సౌత్
గణ బాబు – విశాఖ వెస్ట్
గొట్టిపాటి రవి – అద్దంకి
ఏలూరి సాంబశివరావు – పర్చూరు
గంట శ్రీనివాస్ రావు – విశాఖ నార్త్
బాల వీరాంజనేయులు – కొండెపి
మంతెన రామరాజు – ఉండి
అనగాని సత్యప్రసాద్ – రేపల్లె
జోగేశ్వర రావు – మండపేట

ఊగిసలాటలో ఉన్న నాయకులు

పయ్యావుల కేశవ్ – ఉరవకొండ
బి అశోక్ – ఇచ్ఛాపురం

విడతల వారీగా వైసీపీలో చేరుతారని సమాచారం. ఇప్పటికే ముగ్గురికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.