టీటీడీ నిధుల వినియోగంపై కాగ్ ఆడిట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. గడచిన అయిదేళ్ళకు, ఇక నుంచి టీటీడీ నిధుల ఆడిట్ జరుగుతుందని ఆయన ట్వీట్ చేశారు.
తాను, తన సహచరుడు సత్యపాల్ సబర్వాల్ కలిసి ఈ విషయమై హైకోర్టులో పిటీషన్ వేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి అంగీకారంతో తన పని పూర్తయిందని సుబ్రమణ్యస్వామి అన్నారు.