Breaking News :

వారు కోర్టుకు రావడం లేదు

వరంగల్ జిల్లా పరకాలలో 2012లో అనుమతి తీసుకోకుండా బహిరంగ సభను నిర్వహించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో నేడు నిందితులు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలతో పాటు కొండా మురళీ, సురేఖ దంపతులు నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదు. వారికి కోర్టు జారీ చేసిన సమన్లు ఇంకా అందలేదని తెలుస్తోంది. సమన్లు జారీ అయినా, అధికారికంగా వారికి ఇంకా అవి చేరలేదు. ఈ కారణంతో వారెవరూ నేడు కోర్టుకు హాజరు కావడం లేదని సమాచారం. ఈ విషయాన్ని కొండా సురేఖ ఈ ఉదయం తెలిపారు. తమకు ఎటువంటి సమన్లూ రాలేదని, మీడియాలో వార్తలు వచ్చిన తరువాత, తాను వివరాలు అడిగి తెలుసుకున్నానని అన్నారు. కోర్టుకు తాము వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మరింత సమాచారం వెలువడాల్సి వుంది.

Read Previous

ఎన్టీఆర్ పేరు వినపడకూడదనే నారా రోహిత్ ఎంట్రీ

Read Next

బెడిసికొట్టిన పాము ప్లాన్.. దొరికేసిన కోడలు