TRS పై వైసీపీ నేత అంబటి సంచలన వ్యాఖ్యలు
Timeline

TRS పై వైసీపీ నేత అంబటి సంచలన వ్యాఖ్యలు

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలపై దేశమంతటా ఉత్కంఠ నెలకొంది విషయం తెలిసిందే 150 సీట్లలో 115 సీట్ల వరకు గెలుపును కైవసం చేసుకున్న అభ్యర్థుల జాబితా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్ అయితే ఇందులో ఎక్కువగా మెజారిటీ సీట్లు గెలుపొంది టిఆర్ఎస్ ఆ తర్వాత ఆ తర్వాత బీజేపీ.

అయితే మేయర్ పదవి కోసం కావాల్సిన సీట్లు మాత్రం టిఆర్ఎస్ కు కాస్త తక్కువగా కనిపిస్తున్నట్లు ఉంది. 2016 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బిజెపి మంచి ఊపు లోనే ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలపై అందులో టిఆర్ఎస్ ఫలితాలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ చావుతప్పి కన్నులొట్టబోయినట్లు ఆయన ట్వీట్ చేశారు.

ఇన్నిరోజులు టిఆర్ఎస్ పార్టీ వైసీపీ పార్టీ ఒకటే అనుకున్న వారందరికీ ఆయన వ్యాఖ్యలు షాక్ ఇచ్చాయి. వైసిపి జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై కూడా అందరూ ఇదే కారణం అనుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.