బ్రేకింగ్: బీజేపీ హెడ్ క్వార్టర్స్ కి రఘు రామ కృష్ణ రాజు.. జేపీ నడ్డాతో భేటీ

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు వైసీపీ ఝలక్ ఇచ్చింది. లోక్‌సభలో ఆయన కూర్చునే సీటును వెనక్కి మార్చింది. గతంలో నాల్గో లైన్‌లో ఉన్న సీటును ఏడో లైన్‌లోకి మారుస్తూ లోక్‌సభ అధికారులు తాజాగా సర్క్యులర్ జారీ చేశారు.

వైసీపీ లోక్‌సభా పక్షనేత ఇచ్చిన సూచన మేరకు ఈ మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. ఏడో లైన్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌కు రఘురామకృష్ణం రాజు సీటు కేటాయించారు. 379 సీట్లో ఉన్న ఆయన ప్రస్తుతం 445 సీటుకు మారారు. మార్గాని భరత్‌ 385 నుంచి 379కి వచ్చారు. వీరితో పాటు కోటగిరి శ్రీధర్‌కు 421 నుంచి 385, బెల్లన చంద్రశేఖర్‌కు 445 నుంచి 421కి కేటాయించారు.

వెంటనే బిజెపి హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళిన రఘు రామ కృష్ణ రాజు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశం రాజకీయం కాదని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో సలహాల కోసమే జేపీ నడ్డా ని కలిసాను అని రఘురామరాజు తెలిపారు