జగన్ ఆవేశం తగ్గించుకొని, ఆలోచన పెంచుకుంటే మంచిది
Timeline

జగన్ ఆవేశం తగ్గించుకొని, ఆలోచన పెంచుకుంటే మంచిది

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ మధ్య కాస్త సైలెంట్ అయినట్టు కనిపించారు. మళ్ళీ ఏమైందో కానీ మరో సరి తన పార్టీ కానీ పార్టీ పై విమర్శలు గుప్పించడం రీస్టార్ట్ చేసారు. కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని ఓ వైపు చెపుతున్న జగన్ ప్రభుత్వం, మరోవైపు పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని కామెంట్ చేసారు. ఎన్నికలకు అడ్డొచ్చిన కరోనా విద్యార్థుల ప్రాణాలకు అడ్డు రాలేదా అంటూ ఎద్దేవా చేసార. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టొద్దని ముఖ్యమంత్రి జగన్ కు విన్నపించారు. కరోనా తగ్గిన తర్వాతే పాఠశాలలను ప్రారంభించాలని, జగన్ ఆవేశాన్ని తగ్గించుకుని, ఆలోచన పెంచుకోవాలని సలహా ఇచ్చారు.

అంతే కాదు జగన్ కి మీడియా ముఖంగా చెప్పి , ఏపీ విద్యాశాఖ మంత్రికి మాత్రం లేఖ ద్వారా ఈ విషయాన్నీ రఘురామరాజు తెలియజేశారట. ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో కచ్చితంగా వ్యతిరేక తీర్పు రావచ్చని లేఖలో ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో స్టే రాకపోతే హైకోర్టు ఉత్తర్వులను పాటించాలని చెప్పారు. ఏ మీడియంలో విద్యాబోధనను ప్రారంభించబోతున్నారో ముందు చెప్పాలని కోరారు.