పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు, నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది.
ADVERTISEMENT
అయితే ఇప్పుడు రఘు రామకృష్ణ రాజు ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించినట్లు సమాచారం. సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు.
అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని శుక్రవారం లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ADVERTISEMENT