గూగుల్ స్పందన: “AI వలన ట్రాఫిక్ తగ్గడం లేదు – మేమింకా రోజూ బిలియన్ల క్లిక్స్ పంపిస్తున్నాం”

గూగుల్ స్పందన: “AI వలన ట్రాఫిక్ తగ్గడం లేదు – మేమింకా రోజూ బిలియన్ల క్లిక్స్ పంపిస్తున్నాం”

ప్రచురణకర్తల ఆందోళనలపై గూగుల్ సమాధానం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్‌బాట్లు, సమాధానాలు వెబ్ ట్రాఫిక్‌ను తగ్గిస్తున్నాయన్న ప్రచురణకర్తల ఆందోళనలపై గూగుల్ తాజాగా స్పందించింది. సెర్చ్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న లిజ్ రీడ్ తాజా బ్లాగ్ పోస్టులో, సెర్చ్ ద్వారా వచ్చే క్లీక్స్‌ లో ఏటా పెద్దగా మార్పు లేదని, పైగా “క్లిక్ క్వాలిటీ”లో స్వల్ప మెరుగుదల కనిపించిందని పేర్కొన్నారు. అయితే, ఈ అభిప్రాయాన్ని గూగుల్ ఎలాంటి ఖచ్చితమైన డేటాతోనూ మద్దతించలేదు.

‘జీరో క్లిక్ సెర్చ్’ పెరుగుతోందా?

టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, 2025 మేలో వార్తలతో సంబంధం ఉన్న సెర్చ్‌లలో 69% సెర్చ్‌లు ఏ వెబ్‌సైట్‌కి కూడా లింక్ కాకుండానే ముగిసినట్లు Similarweb అధ్యయనం తెలిపింది. ఇది గత ఏడాది AI Overviews పరిచయం తర్వాత 56% నుంచి పెరిగిన స్థాయి. అంటే వినియోగదారులు సెర్చ్ ఫలితాల్లోనే సమాధానాలు పొందుతూ, వెబ్‌సైట్లను సందర్శించకపోవడం పెరుగుతున్న సూచనలే ఇవి.

ట్రాఫిక్ తగ్గిపోతున్న వెబ్‌సైట్లు – కారణాలు మారుతున్న వినియోగదారుల ప్రవర్తనా?

గూగుల్ సైతం కొన్ని వెబ్‌సైట్ల ట్రాఫిక్ తగ్గుతుందని అంగీకరించింది. కానీ దీనికి AI కాకుండా వినియోగదారుల నూతన అభిరుచులే ప్రధాన కారణమని రీడ్ తెలిపారు. ఫోరమ్‌లు, వీడియోలు, వ్యక్తిగత అనుభవాలతో కూడిన కంటెంట్‌లపైనే ప్రజలు ఎక్కువ దృష్టిపెడుతున్నారన్నది గూగుల్ అభిప్రాయం. ఇప్పటికే 2022లోనే యువత TikTok, Instagramలో రెస్టారెంట్ సెర్చ్‌ల కోసం గూగుల్‌ను కాకుండా వాటినే ఉపయోగించారని గూగుల్ సీనియర్ ప్రతినిధి చెప్పిన విషయం గుర్తుండాలి. అలాగే, షాపింగ్ సెర్చ్‌లకు Amazon, సమాచారం కోసం Reddit వంటి ప్లాట్‌ఫార్మ్‌ల వినియోగం పెరిగింది.

క్లిక్‌ల క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వండి: గూగుల్ సూచన

పబ్లిషర్లకు గూగుల్ సలహా – మిగతా విషయాల కన్నా ‘క్లిక్ క్వాలిటీ’పై దృష్టి పెట్టండి. అంటే వినియోగదారులు నిజంగా కంటెంట్‌తో ఇంటరాక్ట్ అయ్యేలా ఉండాలి. AI Overviews లింక్‌లకు మరింత ఎక్స్‌పోజర్ ఇస్తుండటంతో, దీని ద్వారా వినియోగదారుల లోతైన పరస్పర చర్యలకు అవకాశం పెరుగుతోందని గూగుల్ చెప్పింది. “AI వల్ల వినియోగదారుల ప్రశ్నలు ఎక్కువవుతాయి, పబ్లిషర్లు ఎక్కువగా తమ కంటెంట్‌ను చేరవేసుకునే అవకాశముంటుంది,” అని రీడ్ వివరించారు. అయితే చాలా పబ్లిషర్లకు ఈ ‘లోతైన క్లిక్‌లు’ స్థిరమైన ట్రాఫిక్‌గా మారడం లేదు.

గూగుల్ చెబుతున్నదేమిటి – కానీ వాస్తవ పరిస్థితి ఎలా ఉంది?

AI వలన సెర్చ్‌లు పెరిగాయి:
గూగుల్ ప్రకారం, వినియోగదారులు ముందెన్నడూ అడగని ప్రశ్నలను ఇప్పుడు అడుగుతున్నారు. కానీ, ఈ సెర్చ్‌లు నిజంగా క్లిక్‌లుగా మారుతున్నాయా? ఎన్ని సెర్చ్‌లు వెబ్‌సైట్లను సందర్శించకుండా పూర్తవుతున్నాయన్నది గూగుల్ వెల్లడించలేదు.

ట్రాఫిక్ ‘స్టేబుల్’గా ఉందట:
గతేడాదితో పోలిస్తే, ‘స్లైట్‌గా ఎక్కువ’ నాణ్యమైన క్లిక్‌లు వెబ్‌సైట్లకు వెళ్తున్నాయని గూగుల్ చెబుతోంది. కానీ, “స్లైట్” అంటే ఎంత? “క్వాలిటీ”కి నిర్వచనం ఏంటి? అనే ప్రశ్నలకు గూగుల్ స్పష్టత ఇవ్వలేదు.

AI Overviewsలో మరిన్ని లింకులు కనిపిస్తున్నాయట:
గూగుల్ ప్రకారం, ఇప్పుడు సెర్చ్ ఫలితాల్లో మరిన్ని లింకులు వినియోగదారులకు కనిపిస్తున్నాయట. కానీ గూగుల్ సెర్చ్ కన్సోల్ డేటా ప్రకారం, చాలా వెబ్‌సైట్లకు ఇంప్రెషన్లు పెరిగినా క్లిక్‌లు తగ్గుతున్నాయి. అంటే, “లింక్ కనిపించడం” తప్పనిసరిగా “లింక్‌పై క్లిక్ చేయడం” అనే అర్థం కాదు.

క్లిక్ క్వాలిటీ మెరుగుపడిందట:
యూజర్లు వెంటనే వెనక్కి వెళ్లకుండా, ఒక వెబ్‌సైట్‌లో ఎక్కువ సమయం గడపడమే క్వాలిటీ క్లిక్‌కు సంకేతమంటోంది గూగుల్. కానీ, LLM ఆధారిత ట్రాఫిక్ (AI సెర్చ్‌ల ద్వారా వచ్చిన ట్రాఫిక్) ఆర్గానిక్ ట్రాఫిక్‌తో పోలిస్తే తక్కువగా ఇన్‌గేజ్ అవుతుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

ముగింపు – గూగుల్ ధృవీకరించదగిన డేటా ఇస్తుందా?

గూగుల్ రోజూ బిలియన్ల క్లిక్‌లను వెబ్‌సైట్లకు పంపిస్తోందని చెబుతోంది. కానీ ఈ క్లిక్‌లు ఎవరి వెబ్‌సైట్లకు వెళ్తున్నాయో, ఎవరు నష్టపోతున్నారో గూగుల్ వెల్లడించలేదు. ట్రాఫిక్ ఎలా పంచబడుతోంది? చిన్న పబ్లిషర్లు ఇందులో ఎలా నిలబడగలరు? అనే ప్రశ్నలు ఇంకా అనుత్తరంగానే ఉన్నాయి. AI సెర్చ్‌ల పెరుగుదల వెబ్‌కు కొత్త అవకాశాలనిస్తుందా, లేక పబ్లిషర్ల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందా అనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా చెప్పలేం.

బిర్యాణీ దేవి (Biryani Devi)