All Posts
Business News Timeline

ఎయిర్ ఇండియా ని సొంత చేసుకున్న టాటా

తిరిగి టాటా చేతికే ఎయిర్ ఇండియా  ఎయిర్ ఇండియా ని అత్యధిక బిడ్ చేసి గెలిచిన టాటా సన్స్ ఇప్పుడు ప్రభుత్వ సంస్థగా ఉన్న ఎయిర్ ఇండియాను ఒకప్పుడు స్థాపించింది టాటా వారే. 1932 లో JRD టాటా , టాటా ఎయిర్లైన్స్ ని స్థాపించారు. అంతే కాదు ఆయనే మొట్ట మొదటి లైసెన్సుడ్ పైలట్ అఫ్ ఇండియా కూడా . 1947 ఇండియా కి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో టాటా ఎయిర్లైన్స్ ని నేషనలైజ్ చేసి […]

Read More
Crime News

తెలుగు అకాడమీ లో 50 కోట్ల నిధులు గోల్మాల్

తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ పై విచారణ వేగవంతం చేసిన సీసీ ఎస్ పోలీసులు. తెలుగు అకాడమీ డైరెక్టర్ తో పాటు మరికొంతమందిని విచారిస్తున్న సిసిఎస్ పోలీసులు. బ్యాంకు ప్రతినిధులతో పాటు అకాడమి సిబ్బంది ప్రశ్నిస్తున్నారు, డైరెక్టర్ సోమిరెడ్డి తో పాటు మరికొందరరి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిసిఎస్ పోలీసులు 50 కోట్ల పైచిలుకు నిధుల గోల్మాల్ జరిగినట్లుగా గుర్తించారు. అకాడమీ సిబ్బందితో పాటు బ్యాంకు అధికారుల పాత్రపై సిసిఎస్ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read More
Timeline

Video: కరోనా పరిస్థితులపై విక్టరీ వెంకటేష్ పలు సూచనలు

ప్రముఖ నటుడు వెంకటేష్ కరోనా పరిస్థితులపై పలు సూచనలు చేశారు. కరోనా బారినుంచి దేశాన్ని రక్షించుకోవాలని అన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.”మనం అందరం మన దేశానికి మనం సేవ చేసే టైం వచ్చింది. మనం ఏమీ చేయలేమని అనుకోవద్దు. రోజురోజుకూ భయం కాదు.. బాధ్యత పెరగాలి. అందరూ ఒకరికి ఒకరు దూరంగా ఉంటూ.. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉండాలి. కరోనా వైరస్ నుంచి మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి.” అని వెంకటేష్ సూచించారు.

Read More
Timeline

‘నిధి’ అగర్వాల్ లక్ష సాయం

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలను అప్రమత్తం చేయడంలో సెలబ్రిటీలు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ఫేం నిధి అగర్వాల్ కూడా తనవంతు సాయం చేసింది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు నిధి అగర్వాల్. ఇక నిధి సినిమాల విషయానికి వస్తే, పవన్ హరిహర వీరమల్లు చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తోంది. అటు తమిళంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read More
Timeline

#HBDCharmyKaur: అందాల తార ఛార్మి.. బర్త్ డే స్పెషల్

టాలీవుడ్ అందాల తార ఛార్మీ కౌర్ ఈరోజు తన 34వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ప్రస్తుతం నటనకు దూరంగా జరిగినా, చిత్రసీమలోనే నిర్మాతగా కొనసాగుతోంది. ముద్దుగా బొద్దుగా ఉన్నా, మురిపించే నటనతో జనాన్ని మైమరపించింది. ‘మంత్ర’గా తనదైన అభినయంతో ఉత్తమనటిగా నంది అవార్డును సొంతచేసుకోంది. ‘శ్రీఆంజనేయం’ ‘మాస్’‘అల్లరి పిడుగు’ ‘చక్రం’ ‘రాఖీ’ ‘పౌర్ణమి’ ‘జ్యోతిలక్ష్మి’ వంటి సినిమాలో నటించిన ఛార్మి ప్రస్తుతం ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి విజయవంతమైన సినిమాలు నిర్మిస్తోంది. కాగా ఈ మధ్యే పెళ్లి వార్తలపై స్పందించిన […]

Read More
Politics Timeline

స్టాలిన్‌ను క‌లిసిన ర‌జ‌నీకాంత్.. రూ. 50ల‌క్ష‌ల విరాళం

తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందించారు. తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌ని క‌లిసి రూ.50 ల‌క్ష‌ల రూపాయ‌లు విరాళం అందించారు. ఇప్ప‌టికే సూర్య‌, కార్తీ సోద‌రులు కోటి విరాళం అందించ‌గా, మురుగ‌దాస్ రూ. 25 ల‌క్ష‌లు, అజిత్ 25 ల‌క్ష‌లు అందించిన విషయం తెలిసిందే.

Read More
Timeline

అంతరిక్షంలో మొదటిసారిగా షూటింగ్

‘ఛాలెంజ్’ పేరుతో త్వరలోనే ఓ రష్యన్ సినిమా మొదలు కాబోతోంది. ఈ సినిమా చిత్రీకరణను అంతరిక్షంలోనే జరపనున్నారట. ఇందుకోసం చిత్ర బృందంలో అందరూ శిక్షణ కూడా పొందారట. అందరూ కలిసి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి అక్కడే చిత్రీకరణ జరపనున్నారట. ఈ సినిమాను క్లిమ్‌ షిఫెన్కో అనే దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. రష్యాకు చెందిన స్పేస్‌ ఏజెన్సీ రోస్‌కాస్మోస్‌ త్వరలోనే అంతరిక్షంలో ఈ చిత్ర షూటింగ్‌ జరపనున్నామని ప్రకటించింది. ఇందులో రష్యన్‌ నటి యూలియా పెరెసిల్డ్‌ ప్రధాన పాత్రలో […]

Read More
Timeline Tollywood

బాలయ్య- గోపీచంద్ సినిమాలో శ్రుతి హాసన్!

దర్శకుడు మలినేని గోపీచంద్, నందమూరి బాలకృష్ణతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ నటించనుందని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటితో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. జూలైకి ఈ సినిమా పూర్తి కానుంది. ఆ వెంటనే గోపీచంద్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారట బాలకృష్ణ.

Read More
Timeline

ఆర్థిక ఇబ్బందుల్లో పావలా శ్యామల.. తినడానికి కూడా..!

టాలీవుడ్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. ఒకవైపు కూతురి అనారోగ్యం, మరోవైపు ఆర్థిక సమస్యలతో పావలా శ్యామల తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారు. […]

Read More
Timeline Tollywood

విజ‌య్‌ దేవరకొండకి జోడీ కుదిరింది!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ చిత్రం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలోనే నాయిక‌గా కృతిసనన్ ని ఎంపిక చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట చిత్ర బృందం. విజ‌య్‌కి జోడీగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించని భామ అయితేనే సినిమాకి కొత్త‌ద‌నం వ‌స్తుంద‌ని భావించి ఆమెతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు. గ‌తంలో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘1 నేనొక్క‌డినే’ చిత్రంలో న‌టించింది కృతి. ఆమె న‌ట‌న‌కి ఫిదా అయిన సుకుమార్ ఈ ప్రాజెక్టుతో మ‌రో […]

Read More
Timeline

#Trending: ఇంత చిన్న సినిమాని.. అంతలా ఆదరించారా?

‘సినిమా బండి’ ట్రైలర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాకు ఇప్పుడు మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్‌ నెంబర్‌ 1లో ఉంది. ఈ వైవిధ్యమైన చిత్రంతో ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ఆటో రిక్షా డ్రైవర్‌ చుట్టూ తిరుగుతుంది. ఆటో డ్రైవర్‌కు తన వెనుక సీట్లో కెమెరా దొరుకుతుంది. దాంతో తన స్నేహితుడితో కలిసి మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తాడు. డి 2 […]

Read More
Timeline

గౌరి జి. కిషన్ లేటెస్ట్ ఫొటోస్

తమిళ ‘96’ సినిమాతో సహనటిగా పరిచయం అయినా గౌరి జి కిషాన్ ప్రస్తుతం పలు సినిమా‌లతో బిజీగా ఉంది. ఇటీవలే విజయ్ ‘మాస్టర్’ సినిమాలోనూ సహాయకపాత్రలో గౌరీ అలరించింది. అంతేకాదు, ధనుష్ ‘కర్ణన్’ సినిమాలోను గౌరీ కిషాన్ నటిస్తోంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ […]

Read More
Timeline

ట్రెండ్ అవుతున్న ’50 రూపాయలు’

కరోనా పేరు చెప్పి ప్రభుత్వాలు సామాన్య ప్రజల పై నిత్యావసరాల ధరలు పెంచుతూ కక్ష తీర్చుకుంటున్నాయి. రోజురోజుకీ పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం పెట్రోలు ధర సెంచరీ కొట్టేసింది. ఇక ఎల్పీజీగ్యాస్ ధరపై ఈ రోజు 50 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో దాదాపుగా గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల రూపాయల వరకు ఉండబోతుంది. అంతేకాదు ఇన్ని రోజులు ఇచ్చిన సబ్సిడీ కూడా ప్రభుత్వం తీసివేసింది. ఈరోజు […]

Read More